: కుమార్తె వివాహానికి చంద్రబాబును ఆహ్వానించిన అంజన్ కుమార్ యాదవ్


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసంలో కాంగ్రెస్ నేత, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఈ రోజు కలిశారు. కుమార్తె వివాహానికి రావాలంటూ బాబును ఆహ్వానించారు. పార్టీ మారే ఉద్దేశం ఏమైనా ఉందా? అని అనంతరం విలేకరులు అడగ్గా, అలాంటిదేం లేదన్నారు. తన కుమార్తె వివాహం నిశ్చయమైందని, ఆ పెళ్లికి పిలిచేందుకే వచ్చినట్లు తెలిపారు. పెళ్లి పత్రిక ఇచ్చి చంద్రబాబును ఆహ్వానించినట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News