: ఆత్మాహుతి దాడిలో ఆఫ్ఘన్ అధ్యక్షుడి సోదరుడు మృతి
ఆఫ్ఘనిస్థాన్ లోని కాందహార్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆ దేశాధ్యక్షుడు హమీద్ కర్జాయ్ సోదరుడు హష్మత్ కర్జాయ్ మృతి చెందాడు. రంజాన్ సందర్భంగా హష్మత్ కు శుభాకాంక్షలు చెప్పేందుకు ఓ వ్యక్తి అతని ఇంటికి వచ్చాడని, ఆలింగనం చేసుకున్న అనంతరం తన వద్ద ఉన్న పేలుడు పదార్ధాలను పేల్చివేశాడని... ఈ ఘటనలో హష్మత్ చనిపోయినట్లు కాందహార్ గవర్నర్ ప్రతినిధి దవా ఖాన్ మణిపాల్ వెల్లడించాడు.