: మోడీ 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్'కు జాన్ కెర్రీ ప్రశంసలు


అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో తీసుకొచ్చిన 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్' నినాదాన్ని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ప్రశంసించారు. ఈ మేరకు వాషింగ్టన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో భారత్ తో విదేశాంగ విధానంపై కెర్రీ మాట్లాడారు. కొత్త ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో మోడీ అభివృద్ధి అజెండా గురించి మాట్లాడుతూ, 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్' నినాదానికి తాము మద్దతు పలుకుతామన్నారు. ఇదొక గొప్ప విజన్ అని నమ్ముతున్నామని పేర్కొన్నారు. భారత ఆర్థికవృద్ధి పునరుద్ధరణకు తోడ్పడేందుకు యూఎస్ ప్రైవేట్ సెక్టార్ ఆసక్తితో ఉందని తెలిపారు. కాగా, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తో ఐదవ వార్షిక భారత్-అమెరికా వ్యూహాత్మక చర్చలకోసం ఈ వారంలో కెర్రీ భారత్ రానున్నారు.

  • Loading...

More Telugu News