: కండోమ్స్ ధాటికి డ్రైనేజీ నిలిచిపోయింది
లండన్ ఒలింపిక్స్, సాకర్ వరల్డ్ కప్, గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ ఇలా ఎక్కడ ఆటలపోటీలు జరిగినా నిర్వాహకులు వసతి, భోజనం, గ్రౌండ్, శుభ్రత వంటి అన్ని సౌకర్యాలు కల్పించగలుగుతున్నారు కానీ కండోమ్ లు మాత్రం సరిపడా సరఫరా చేయలేకపోతున్నారు. గత సంఘటనలను దృష్టిలో ఉంచుకుని స్కాట్లాండ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో కండోమ్స్‌ను భారీ సంఖ్యలో సరఫరా చేసింది. మహిళల కండోమ్స్ సహా పలు కంపెనీలకు చెందిన నాణ్యమైన పది రకాల కండోమ్స్ ను క్రీడాకారులు, ప్రేక్షకుల కోసం అందుబాటులో ఉంచారు. పోటీలు జరిగే 300 వేదికలకూ కండోమ్స్‌ను సరఫరా చేశారు. దాదాపు 84 వేలకు పైగా కండోమ్స్‌ను సరఫరా చేసినట్టు అధికారులు తెలిపారు. క్రీడాకారులు, ఇతర స్టాఫ్ తమకు నచ్చినవాటిని ఉచితంగా తీసుకోవచ్చు. ఇతరులు మాత్రం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాగా, కామన్వెల్త్ గేమ్స్ లో 71 దేశాలకు చెందిన క్రీడాకారులు పోటీ పడుతున్నారు. కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా గ్లాస్గోలో హోటల్స్, బార్లు కళకళలాడిపోతున్నాయి. క్రీడలను తిలకించేందుకు ప్రతివారం 7.5 లక్షల మంది నగరానికి వస్తున్నారు. మెగా ఈవెంట్లు నిర్వహించే ప్రతిసారి క్రీడాకారుల అద్భత ప్రదర్శన, పతకాల ముచ్చట్ల తరువాత వచ్చేది కండోమ్ ల ప్రస్తావనే అంటే అతిశయోక్తి కాదు. రెండేళ్ల క్రితం జరిగిన లండన్ ఒలింపిక్స్, తాజాగా బ్రెజిల్ లో జరిగిన సాకర్ వరల్డ్ కప్ లకు రికార్డు స్థాయిలో కండోమ్స్‌ను సరఫరా చేసినా కొరత ఏర్పడింది. ఇక గతంలో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో అయితే క్రీడాకారులు, కోచ్‌లు, సహాయ సిబ్బంది కోసం నిర్మించిన క్రీడాగ్రామంలో కండోమ్స్ అడ్డుపడి డ్రైనేజ్ బ్లాక్ అయిపోయిందంటే వీటి డిమాండ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.