: ఎంసెట్ కు లైన్ క్లియర్
ఎంసెట్ కౌన్సిలింగ్ కు లైన్ క్లియరైంది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30 న ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఆగస్టు 7 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమవుతుందని ఉన్నత విద్యాశాఖ తెలిపింది. ఫీజు రీయింబర్స్ మెంట్ వివాదం పరిష్కారమైన తరువాత సీట్ల కేటాయింపు ఉంటుందని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు హాజరుకాకపోవడం విశేషం.