: భారీ స్కోరు దిశగా ఇంగ్లాండ్... బెలెన్స్ కి బ్రేక్ వేసిన రోహిత్ శర్మ
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయిన ఇంగ్లీష్ టీమ్ 358 భారీ పరుగులు సాధించింది. టీమిండియా కెప్టెన్ ధోనీ బెలెన్స్ కు అడ్డుకట్ట వేసేందుకు భారత బౌలర్లందర్నీ ప్రయోగించాడు. చివరకు రోహిత్ శర్మ బెలెన్స్ ను 156 పరుగుల వద్ద అవుట్ చేశాడు. బెల్ (68)కు జోడీగా జో రూట్ (2) బ్యాటింగ్ కి దిగాడు. వీరిద్దరూ ఆచి తూచి ఆడుతూ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. షమీ, జడేజా, రోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది.