: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు రెండు పతకాలు


గ్లాస్గోలో జరుగుతోన్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు వచ్చి పడ్డాయి. 50 మీటర్ల పిస్టల్ విభాగంలో భారత్ కు బంగారు, వెండి పతకాలు లభించాయి. ఈ విభాగంలో జీతూరాయ్ స్వర్ణ పతకం సాదించగా, గురుపాల్ సింగ్ రజత పతకాన్ని దక్కించుకున్నాడు. కామన్వెల్త్ క్రీడల్లో భారత షూటర్లు తమ సత్తా చాటారు. దీంతో షూటింగ్ విభాగంలో మొత్తం 4 స్వర్ణాలు, 6 రజతాలు, ఒక కాంస్య పతకాలను భారత్ గెలుచుకుంది.

  • Loading...

More Telugu News