: హైదరాబాదులో ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో కీలక భేటీ
ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో కీలక భేటీ హైదరాబాదులో ప్రారంభమైంది. వృత్తివిద్యా ప్రవేశాల కౌన్సిలింగ్ పై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశానికి రావాలంటూ ఇరు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులకు ఆహ్వానం పంపారు. అయితే, తెలంగాణ విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఉమ్మడి అడ్మిషన్లు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విషయం విదితమే.