: కష్టాల్లో తెలుగు వికీపీడియా


పదకొండేళ్ళ క్రితం ప్రారంభమైన తెలుగు వికీపీడియా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. మిగతా భాషల వికిపీడియాలతో పోల్చితే తెలుగు వెర్షన్ ఏమంత అభివృద్ధి చెందలేదనే చెప్పాలి. ఇప్పటి వరకు తెలుగు వికీపీడియాలో 20,000 ఆర్టికల్స్ మాత్రమే పొందుపరిచారట. తెలుగులో కంటెంట్ రైటర్స్ లేకనా అంటే అదీ కాదు. దాదాపు 1000 నుంచి 2000 మంది దాకా తెలుగు బ్లాగర్లు క్రియాశీలకంగా ఉన్నారు. అయితే వారందరూ కంటెంట్ కింద తమ పేరు చూసుకోవడానికే ఇష్టపడుతున్నారని, వికీపీడియాలో కంటెంట్ కింద పేరు పెట్టుకోవడం కుదరదు గనుక వారు ఇటువైపు చూడడంలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. 2006-07లో గ్రామాల గురించి 30,000 ఏకవాక్య ఆర్టికల్స్ ను పొందుపరిచారు. తమ గ్రామాల పేర్లు చూసైనా కొందరు స్పందిస్తారన్న ఉద్దేశంతో వాటిని తెలుగు వికీపీడియాలో చేర్చారు. ఆ ఆలోచన ఫలించి 5000 వ్యాసాలు తెలుగు వికీపీడియా సరసకు చేరాయి. కాగా, పాఠశాల విద్యార్థులను ఇందులో భాగస్వాములను చేస్తే ప్రయోజనం ఉంటుందని నిపుణులు అంటున్నారు. కనీసం వారు తమ పాఠ్యాంశాలను పొందుపరిచినా తెలుగు వికీపీడియా మరింత విస్తరించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News