: విమర్శకుల నోళ్ళు మూయించిన ఇంగ్లండ్ సారథి
సౌతాంప్టన్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ కెప్టెన్ ఆలిస్టర్ కుక్ ఆడిన ఇన్నింగ్స్ అతడిలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిందనడంలో సందేహం అక్కర్లేదు. భారత బౌలర్లను సమర్థంగా ఎదురొడ్డిన కుక్ 95 పరుగుల వద్ద వెనుదిరిగాడు. దీనిపై అతడు మాట్లాడుతూ, సెంచరీకి చేరువలో అవుట్ కావడం నిరుత్సాహానికి గురిచేసిందని పేర్కొన్నాడు. వైఫల్యాల నేపథ్యంలో ఎంతో ఒత్తిడి నడుమ పరుగులు సాధించడం సంతోషాన్నిచ్చిందని తెలిపాడు. తన బ్యాటింగ్ సవ్యదిశలోనే సాగుతుందన్న విషయం తాజా ఇన్నింగ్స్ తో రుజువైందని చెప్పుకొచ్చాడు.