: రాఖీ కట్టిన సోదరికి సల్మాన్ కన్యాదానం!


నటుడు సల్మాన్ ఖాన్ కన్యాదానం చేయబోతున్నాడు. అదేంటి పెళ్లి, పిల్లలు లేకుండా కన్యాదానం ఎలా చేస్తాడు? అని ఆలోచిస్తున్నారు కదా. వివరాల్లోకి వెళితే... ప్రతి ఏడాది సల్మాన్ కు శ్వేత రొహిరా అనే అమ్మాయి రాఖీ కడుతుంది. బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్, ఈమె కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది గోవాలో పెళ్లి చేసుకుంటున్నారు. అయితే, చిన్నవయసులోనే తండ్రిని కోల్పోయిన తన రాఖీ సోదరికి కన్యాదానం చేసే బాధ్యతను సల్లూనే తీసుకుంటున్నాడు. అలా నిజజీవితంలో సల్మాన్ ఓ క్రతువు నిర్వహించబోతున్నాడు.

  • Loading...

More Telugu News