: ఛలో విజయవాడ అంటున్న ఏపీ మంత్రులు... దేవినేని బాటలో కామినేని


పది సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినప్పటికీ... ఆంధ్రప్రదేశ్ మంత్రులు హైదరాబాద్ లో పనిచేసేందుకు పెద్దగా ఆసక్తిని ప్రదర్శించడం లేదు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే... భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ తన కార్యాలయాన్ని విజయవాడకు మార్చుకున్నారు. విజయవాడ కేంద్రంగా ఆయన తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా దేవినేని ఉమ బాటలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా హైదరాబాద్ బదులు విజయవాడ నుంచే తన కార్యకలాపాలు నిర్వహించాలని నిశ్చయించుకున్నారు. కామినేని శ్రీనివాస్ విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్శిటీలోకి తన ఆఫీస్ ను మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు, ఎన్టీఆర్ యూనివర్శిటీలోని సిల్వర్ జూబ్లీ బ్లాక్ ను మంత్రి కార్యాలయంగా మార్చేందుకు అధికారులు పనులు మొదలుపెట్టారు. దేవినేని ఉమతో పాటు కామినేని శ్రీనివాస్ కూడా విజయవాడ కేంద్రంగా పని చేయాలని నిర్ణయించుకోవడంతో... మరింత మంది ఏపీ మంత్రులు హైదరాబాద్ నుంచి 'షిప్టింగ్' ఆలోచనలు తీవ్రంగా చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

  • Loading...

More Telugu News