: 'కొలిమి' సినిమాకు సీఎం కేసీఆర్ పాటలు
'కొలిమి' అనే టైటిల్ తో రూపొందిన సినిమాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాటలు రాశారు. త్వరలో విడుదలకానున్న ఈ చిత్రానికి ఆయన పాటలు రాసినట్లు దర్శకుడు గోలి నాగేందర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా ముత్తారంలోని తమ బంధువుల ఇంటికి నిన్న(ఆదివారం) వచ్చిన అతను మీడియాతో మాట్లాడుతూ పై విషయాన్ని వెల్లడించాడు. కేసీఆర్ రచించిన పాటలతో తెలంగాణ ఉద్యమ భావాలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునే విధంగా 2011లో ఈ సినిమాను ప్రారంభించినట్లు తెలిపారు. కాగా, రెండేళ్ళ క్రితం వచ్చిన 'జై బోలో తెలంగాణ' చిత్రంలో కూడా కేసీఆర్ ఓ పాట రాసిన సంగతి విదితమే!