: ములకనూరు బస్టాండ్ లోకి ప్రవేశించిన ఎలుగుబంటి
ఓ ఎలుగుబంటి సోమవారం ఉదయం కరీంనగర్ జిల్లా ములకనూరు బస్టాండ్ లో ప్రత్యక్షమైంది. జనావాసాల్లోకి వచ్చే ఎలుగుబంట్లు జనాలను చూడగానే పారిపోవడం, భయంతో జనాలపై దాడులు చేయడం తరహా ఘటనలు చోటుచేసుకోగా... సోమవారం మాత్రం ఆ ఎలుగుబంటి ఏకంగా బస్టాండ్ లోకే వచ్చేసింది. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఎలుగుకు అందనంత దూరం వెళ్లిన తర్వాత ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు.