: భర్తపై ఫిర్యాదు చేసిన న్యూస్ రీడర్


తన భర్త బెదిరిస్తున్నాడంటూ ఓ న్యూస్ రీడర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే, బంజారాహిల్స్ రోడ్ నెంబర్-2లో ఉన్న న్యూస్ చానల్ లో పనిచేస్తున్న అనుశ్రీ అనే న్యూస్ రీడర్ కు మల్లికార్జునరావుతో పెళ్లైంది. అనుశ్రీకి తెలియకుండా ఇటీవల మల్లికార్జున్ మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో ఆమె ఎస్సార్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు మేరకు మల్లికార్జునరావుపై పోలీసులు 498ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలంటూ అనుశ్రీపై ఆమె భర్త ఒత్తిడి తెచ్చేవాడు. అంతేకాకుండా, ఆమె పనిచేస్తున్న చానల్ కార్యాలయం వద్దకు వెళ్లి బెదిరింపులకు పాల్పడేవాడు. దీని వల్ల, అనుశ్రీ విధినిర్వహణకు కూడా ఆటంకం ఏర్పడేది. ఈ నేపథ్యంలో, కేసును ఉపసంహరించుకోవాలంటూ తన భర్త బెదిరింపులకు దిగుతున్నాడంటూ అనుశ్రీ మరోసారి పోలీసులను ఆశ్రయించింది. దీంతో మల్లికార్జున్ పై బంజారాహిల్స్ పోలీసులు 506 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News