: రాష్ట్రపతి భవన్ లో స్పెషల్ మ్యూజియం ఏర్పాటు


రాష్ట్రపతిగా ఇటీవలే రెండేళ్లు పూర్తిచేసుకున్నారు ప్రణబ్ ముఖర్జీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్ లో ఒక ప్రత్యేక మ్యూజియంను ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ల సమక్షంలో ప్రారంభమైన ఈ మ్యూజియమ్ ను దేశానికి అంకితం ఇస్తున్నట్లు ప్రణబ్ ప్రకటించారు. దేశాన్ని ఇప్పటివరకూ పాలించిన రాష్ట్రపతులు, వారి వివరాలు, రాష్ట్రపతిభవన్‌ చరిత్రను మొత్తం ఈ మ్యూజియంలో నిక్షిప్తం చేశారు. అంతేకాకుండా గతంలో రాష్ట్రపతులు అందుకున్న ప్రతిష్ఠాత్మకమైన బహుమతులను కూడా ఈ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. రాష్ట్రపతి భవన్‌లో ఇప్పటివరకూ వినియోగించని వస్తువులను కూడా శుభ్రపరిచి మ్యూజియంలో సందర్శకులకోసం ఏర్పాటు చేస్తున్నారు. ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ఈ మ్యూజియం ప్రజల సందర్శనార్థం ప్రారంభమవుతుంది. మ్యూజియాన్ని చూడటానికి ప్రవేశ రుసుము ఉంటుంది. రాష్ట్రపతి భవన్ లో ఉన్న డాక్టర్ రాజేంద్రప్రసాద్ సర్వోదయవిద్యాలయంలో ఓ విజ్ఞాన కేంద్రాన్ని కూడా ప్రణబ్ ఏర్పాటు చేయించారు. ఈ నాలెడ్జ్ హబ్ టీచర్లకు, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్రపతి భవన్ వర్గాలు అంటున్నాయి.

  • Loading...

More Telugu News