: కామన్వెల్త్ లో భారత్ కు పతకాల పంట


కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా ఆదివారం భారత క్రీడాకారులు సత్తా చాటారు. వెయిట్ లిఫ్టింగ్ 77 కిలోల విభాగంలో భారత లిఫ్టర్లు సుతీశ్ శివలింగం బంగారు పతకాన్ని సాధించగా, ఇదే విభాగంలో మరో భారతీయుడు రవి సిల్వర్ మెడల్ ను కైవసం చేసుకున్నాడు. మొత్తం 328 కిలోల బరువు ఎత్తిన సతీశ్, కామన్వెల్త్ క్రీడల్లోనే ఈ విభాగంలో అత్యధిక బరువునెత్తి సరికొత్త రికార్డును లిఖించాడు. ఒకే విభాగంలో రెండు పతకాలను కైవసం చేసుకుని భారత లిఫ్టర్లు సంచలనం సృష్టించారు. మరోవైపు షూటింగ్ విభాగంలో భారత క్రీడాకారులు ఆదివారం కూడా సత్తా చాటారు. మహిళల డబుల్ ట్రాప్ ఈవెంట్ లో శ్రేయాసీ సింగ్ రజతం సాధించగా, పురుషుల విభాగంలో మహ్మద్ అసబ్ కాంస్యం నెగ్గాడు. ఆదివారం నాడు వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు మరో రెండు పతకాలు కూడా దక్కాయి. 69 కిలోల పురుషుల విభాగంలో ఓంకార్ ఒటారి, 63 కిలోల మహిళల విభాగంలో పూనమ్ యాదవ్ లు కాంస్య పతకాలు సాధించారు. దీంతో ఇప్పటిదాకా భారత్ ఖాతాలో ఆరు బంగారు పతకాలు చేరాయి. 9 రజత, 8 కాంస్య పతకాలతో భారత్ ఐదో స్థానంలో నిలిచింది.

  • Loading...

More Telugu News