: శ్రీవారి ఆలయంలో చోరీ
తిరుమలలో చోరీలు పెరిగిపోతున్నాయి. భక్తుల సొమ్ముకు భద్రత లేకుండా పోయింది. దొంగలు సందు దొరికితే దోపిడీకి బరి తెగిస్తున్నారు. ఈ రోజు శ్రీవారి ఆలయంలో స్వామి దర్శనం కోసం క్యూలెైన్ లో ఉన్న భక్తుడి నుంచి 2లక్షల రూపాయలు చోరీకి గురయ్యాయి. దీనిపై మహారాష్ట్రకు చెందిన బాధిత భక్తుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిన్న జిహెచ్ సి వసతి సముదాయంలో దొంగలు పలు కాటేజీలలోకి ప్రవేశించి భక్తుల నగదు, వస్త్రాలు, సెల్ ఫోన్లు తస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.