: కొరకరాని కొయ్యల్లా తయారైన కుక్, బాలెన్స్
సౌతాంప్టన్ టెస్టులో భారత బౌలర్లు చెమటోడ్చుతున్నారు. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ ను అవుట్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, కెప్టెన్ కుక్, బాలెన్స్ జోడీ టీమిండియా బౌలింగ్ దాడులను సమర్థంగా కాచుకుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు వికెట్ నష్టానికి 186 పరుగులు కాగా... కుక్ 82, బాలెన్స్ 72 పరుగులతో క్రీజులో ఉన్నారు. లార్డ్స్ టెస్టులో విశేషంగా రాణించిన భారత బౌలర్లు సౌతాంప్టన్ పిచ్ పై తేలిపోయారు. ముఖ్యంగా ఇషాంత్ లేని లోటు స్పష్టంగా కనిపించింది.