: రాజంపేటలో ఘరానాదొంగల అరెస్టు
కడప జిల్లా రాజంపేటలో ఐదుగురు ఘరానా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారు ఓ పంచలోహ విగ్రహాన్ని అమ్మబోతుండగా అదుపులోకి తీసుకున్నారు. ఆ విగ్రహం విలువ రూ.50 లక్షలుంటుందని అంచనా. కాగా, ఆ విగ్రహం ఏడేళ్ళ క్రితం చిత్తూరు జిల్లా పుత్తూరులో చోరీకి గురైనట్టు గుర్తించారు.