: ఫామ్ దొరకబుచ్చుకున్న ఇంగ్లండ్ సారథి
గతకొన్నాళ్ళుగా ఫామ్ లేమితో విమర్శలపాలైన ఇంగ్లండ్ కెప్టెన్ ఆలిస్టర్ కుక్ అర్థ సెంచరీతో అలరించాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న కుక్ లంచ్ విరామానంతరం ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు వికెట్ నష్టానికి 84 పరుగులు కాగా, కుక్ 50, బాలెన్స్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.