: మహారాష్ట్ర ఉద్యానశాఖ బ్రాండ్ అంబాసడర్ గా అమితాబ్
'బిగ్ బి' అమితాబ్ బచ్చన్ భుజస్కంధాలపై మరో బాధ్యత. తాజాగా ఆయనను మహారాష్ట్ర ఉద్యాన శాఖ అంబాసడర్ గా నియమించింది. ఇప్పటికే ఆయన గుజరాత్ రాష్ట్ర పర్యాటక శాఖ సౌహార్ద్ర రాయబారిగా వ్యవహరిస్తున్నారు. దీనిపై 'బిగ్ బి' ట్విట్టర్లో స్పందిస్తూ, తన నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఉద్యాన శాఖ ఫల ఉత్పత్తులకు ఇకపై తాను బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తానని తెలిపారు. విభిన్న రకాల ఫలాలను పండించడంలో మహారాష్ట్ర నెంబర్ వన్ రాష్ట్రమని తనకు ఇప్పటి వరకు తెలియదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.