: స్థానికత అంశంపై అశోక్ బాబు అభ్యంతరం


తెలంగాణ నేతలు చెబుతున్న స్థానికత అంశంపై ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, స్థానికతపై తెలంగాణ నేతల అభిప్రాయాలను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఈ నెల 30న హైదరాబాదులో ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ తర్వాత రోజు కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల్లో మార్పులపై నివేదిక ఇస్తామని అశోక్ బాబు చెప్పారు. కాగా, ఎయిడెడ్ స్కూళ్ళు, ఇతర విభాగాల్లో 60 ఏళ్ళ పదవీవిరమణ పెంపు వర్తించడంలేదని తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఉద్యోగులకు హెల్త్ కార్డుల విషయమై ప్రభుత్వ నిర్ణయాన్ని కోరతామన్నారు. కాగా, సెప్టెంబర్ 27, 28, 29 తేదీల్లో విశాఖపట్నంలో మహిళా ఉద్యోగ సంఘాల రాష్ట్రస్థాయి మహాసభలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News