: రోడ్డుపై దిగిన విమానం ట్రక్కును ఢీకొట్టింది


అమెరికాలో ఓ చిన్న విమానం సాంకేతిక లోపంతో రోడ్డుపై దిగింది. ఇంజిన్ చెడిపోవడంతో నెవాడాలోని ఓ జాతీయ రహదారిపై ల్యాండైంది. అయితే, సాంకేతిక లోపం గురించి విమాన పైలట్ అధికారులకు సమాచారమందించడంతో అప్పటికే అక్కడ ఓ పికప్ ట్రక్కును సిద్ధంగా ఉంచారు. ఈ విమానం కాస్తా ల్యాండయ్యే క్రమంలో ఆ ట్రక్కును ఢీకొన్నది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం సంభవించలేదు. విమానంలో ఇద్దరికి, ట్రక్కులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్పగాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News