: 'దీదీ'పై బెంగాల్ చిత్రసీమ గరంగరం


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వైఖరి పట్ల అక్కడి సినీ పరిశ్రమ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అవార్డుల విషయంలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి పక్షపాత ధోరణితో వ్యవహరించారని సినీ ప్రముఖులు ఆరోపిస్తున్నారు. తన మద్దతుదారులకే అవార్డులు ఇచ్చుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం అక్కడి చిత్రసీమ రెండు వర్గాలుగా విడిపోయింది. ఓ వర్గం దీదీకి కొమ్ముకాస్తుండగా, మరో వర్గం సీఎం విధానాలను వ్యతిరేకిస్తోంది. మమతా బెనర్జీ రాజకీయాలు మంచి సినిమాలకు ముప్పుగా పరిణమించాయన్న వాదనలు ఇప్పుడు బెంగాల్లో వినిపిస్తున్నాయి. ఈ అవార్డుల ప్రహసనం ప్రమాదకరంగా పరిణమిస్తోందని, ముఖ్యమంత్రి తన చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి ఏదో ఒకటి చెయ్యాలని, లేకుంటే ఈ అవార్డులకు అర్థం ఉండదని ఫిలింమేకర్ బుద్ధదేబ్ దాస్ గుప్తా అభిప్రాయపడ్డారు. ఇక, నటి రూపా గంగూలీ మాట్లాడుతూ, సినీ పరిశ్రమపై మునుపెన్నడూ రాజకీయాలు ప్రభావం చూపలేదని వాపోయారు.

  • Loading...

More Telugu News