: ఫోన్ లో వేధిస్తున్న వ్యక్తిని చితకబాదిన యువతి
ఫోన్లో కొన్ని రోజులుగా వేధిస్తూ, రకరకాల మాటలతో ఇబ్బంది పెడుతున్న వ్యక్తికి ఓ యువతి చేతలతో బుద్ధి చెప్పింది. హైదరాబాదు సమీపంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తున్న ఆయుశ్రీ అనే యువతిని సత్యనారాయణ అనే వ్యక్తి కొన్నాళ్లుగా ఫోన్ ద్వారా వేధింపులకు గురి చేస్తున్నాడు. మాటలతో ఎంత చెప్పినా సత్యనారాయణ వినకపోవడంతో ఆఖరికి విసిగిపోయిన ఆయుశ్రీ మంచి మాటలతో అతనిని తను పని చేసే షాపింగ్ మాల్ దగ్గరికి రప్పించింది. షాపింగ్ మాల్ కు రాగానే తన సహచరులతో కలిసి అతని మీద దాడి చేసింది. షాపింగ్ మాల్ సిబ్బంది సహాయంతో సత్యనారాయణ చొక్కా విప్పించి మరీ కాళ్లు, చేతులతో పిచ్చపిచ్చగా చితకబాదింది. పోలీసులు సత్యనారాయణను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.