: విశాఖలో ఐటీ సంస్థ ఏర్పాటుకు విప్రో ప్రతిపాదన... ఓకే చెప్పిన బాబు


సీఎం చంద్రబాబు నాయుడితో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ భేటీ ముగిసింది. ఈ భేటీ వివరాలను మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మీడియాకు తెలిపారు. విశాఖలో రూ.500 కోట్లతో ఐటీ సంస్థ ఏర్పాటు చేస్తామని విప్రో బాబును కోరిందని చెప్పారు. విప్రో ప్రతిపాదనకు ఆయన అంగీకారం తెలిపారని పల్లె వెల్లడించారు. ఐదేళ్ళలో ఏడు వేల మందికి ఉపాధి కల్పించేందుకు విప్రో అంగీకరించిందని తెలిపారు. విప్రో సేవలను క్రమేణా విజయవాడ, కాకినాడ, తిరుపతి నగరాలకూ విస్తరిస్తారని మంత్రి చెప్పారు. అంతేగాకుండా, హిందూపురంలో రూ.500 కోట్లతో సంతూర్ సబ్బుల పరిశ్రమ ఏర్పాటవుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News