: ఏపీ అభివృద్ధి కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం: రఘువీరా


ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో బీజేపీ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. అయితే పంట రుణమాఫీపై మాట్లాడటానికి ఆయన నిరాకరించారు. ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలనే దానిపై విశాఖలో పార్టీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News