: కంటెయినర్ బోల్తాకొట్టడంతో 20 ఆవులు మృతి


ఆవులను అక్రమంగా, రహస్యంగా తరలిస్తున్న కంటెయినర్ బోల్తా కొట్టడంతో... అందులోని 20 ఆవులు మృతి చెందాయి. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని హయత్ నగర్ మండలం అబ్దుల్లాపూర్ మెట్ వద్ద జరిగింది. ఈ ఘటనలో మరికొన్ని ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి. కంటెయినర్ డ్రైవర్ పరారయ్యాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అధిక లోడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News