: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆర్.కృష్ణయ్య
తెలంగాణ రాష్ట్ర టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరిగిన బీసీల జాతీయస్థాయి సదస్సులో ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. భారతదేశ జనాభాలో 56 శాతం ఉన్న 65 కోట్ల బీసీలకు రాజ్యాంగపరంగా చట్టసభలు, ప్రభుత్వరంగ సంస్థల్లో దక్కాల్సిన రిజర్వేషన్లు అందేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ఆయన ప్రకటించారు. బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కె.ఆల్మన్ రాజును జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ఆర్.కృష్ణయ్య ప్రకటించారు.