: హైదరాబాదులో బయట మందు కొడితే... ‘లోపల’ వేస్తారు


గ్రేటర్ హైదరాబాదులో బహిరంగ మద్యపానం చేసే వారిపై తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులు దృష్టి సారించారు. సాయంత్రం పూట కాలనీల సమీపంలో రోడ్డు పక్కనున్న వైన్ షాపుల ముందే మద్యం తాగుతున్న మందుబాబులతో ఉద్యోగినులు, యువతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో... నగరంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై పోలీసులు ఇంతకు ముందే నిషేధాజ్ఞలు విధించారు. తాజాగా నిషేధాజ్ఞలను పొడిగిస్తూ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం ఉదయం ఆరుగంటల నుంచి 29వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని ఆయన అన్నారు. ఈ ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News