: మాసాయిపేట ఎఫెక్ట్: డ్రైవర్లకు, స్కూల్ యాజమాన్యాలకు టీఎస్ సర్కార్ శిక్షణా తరగతులు


మాసాయిపేట ఘటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ పునరావృతం కాకుండా పాఠశాలల యాజమాన్యానికి అవగాహన తరగతులు... బస్సు డ్రైవర్లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,252 ప్రైవేటు స్కూళ్లకు రవాణా శాఖ సమాచారం పంపింది. ఇకపై డ్రైవర్ల విషయంలో స్కూల్ యాజమాన్యాలు అప్రమత్తంగా వ్యవహరించాలని... వారికి తరచుగా వైద్యపరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది.

  • Loading...

More Telugu News