: కాకతీయ వర్శిటీ హాస్టల్ లో ఆకలితో అల్లాడుతున్న విద్యార్థులు


అది వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయం... ఉస్మానియా వర్శిటీ తర్వాతి స్థానంలో ఉన్న వర్శిటీ. అలాంటి ప్రముఖమైన వర్శిటీ క్యాంపస్ లోని హాస్టల్ లో క్లాసులు మొదలై నెల రోజులు కావస్తున్నా మెస్ ఇంకా తెరచుకోలేదు. దీంతో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. మరికొందరు విద్యార్థులు చేసేది లేక స్వయంపాకం చేసుకొంటున్నారు. ఓ పక్క వంట చేసుకుంటూ.. మరో పక్క క్లాసులకు హాజరుకావడం ఇబ్బందిగా మారిందని విద్యార్థులు అంటున్నారు. సరుకులు కొనుక్కొని హాస్టల్ గదుల్లో వంట తయారుచేసుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించి... తమ క్షుద్బాధను తీర్చాలని వారు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News