: ఈ పోకిరీకి బాలీవుడ్ సినిమాలే స్ఫూర్తి!


ఆస్ట్రేలియాలో ఓ భారత జాతీయుడు మహిళలను వేధించిన కేసులో విచారణ ఎదుర్కొంటున్నాడు. మహిళలపై వేధింపులకు తనకు బాలీవుడ్ సినిమాలే ప్రేరణ అని న్యాయమూర్తికి చెప్పాడీ పోకిరి. అతడి పేరు సందేశ్ బలిగా (31). టాస్మానియాలో నివసిస్తుంటాడీ వ్యక్తి. 2012, 2013లో ఇద్దరు ఆసీస్ మహిళల వెంటపడుతుండడంతో అతడిని అరెస్టు చేశారు. హోబర్ట్ మేజిస్ట్రేట్ కోర్టు తాజాగా ఈ కేసును విచారిస్తూ... బాలీవుడ్ లో రూపొందే రొమాంటిక్ సినిమాల్లోలా అమ్మాయిల వెంటపడితే వారు ప్రేమలో పడిపోతారని ఇతగాడు భావిస్తున్నాడని పేర్కొంది. కాగా, డిఫెన్స్ లాయర్లు కాస్త కటువుగానే వ్యాఖ్యానించారు ఈ కేసులో. సందేశ్ ప్రవర్తనకు భారత సంస్కృతి కారణమని, ఆస్ట్రేలియాలో అలా ప్రవర్తించడం కుదరదన్న విషయం ఇప్పుడు అర్థమై ఉంటుందని పేర్కొంది.

  • Loading...

More Telugu News