: రైళ్ళకు సోలార్ శక్తి..!
రైలు బోగీల పైకప్పుకు సోలార్ ప్యానెళ్ళు తగిలించడం ద్వారా విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేసేందుకు బెంగళూరు శాస్త్రవేత్తలు నడుంబిగించారు. ఈ విధానంలో ఫొటో వోల్టాయిక్ ప్యానెళ్ళను ప్రతి కంపార్ట్ మెంట్ పై భాగంలో అమర్చుతారు. తద్వారా ఆ కంపార్ట్ మెంటుకు అవసరమైన విద్యుత్ అక్కడికక్కడే తయారవుతుంది. ఏమైనా విద్యుత్ మిగిలితే రాత్రివేళ అవసరాల కోసం బ్యాటరీల్లో భద్రపరుస్తారు. ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్ళకు ఈ పద్ధతి ఉపయుక్తంగా ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ సోలార్ ఎనర్జీ వ్యవస్థ అందుబాటులోకి వస్తే భారత రైల్వేలకు ఖర్చు భారీగా తగ్గుతుంది.