: 'మై గవర్నమెంట్' పేరుతో వెబ్ సైట్ ప్రారంభించిన మోడీ
ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ పాలనకు రెండు నెలలు పూర్తయింది. ఈ సందర్భంగా 'మై గవర్నమెంట్' (mygov.nic.in) పేరుతో మోడీ కొత్త వెబ్ సైట్ ప్రారంభించారు. సురాజ్యం కోసం ప్రజల అభిప్రాయాలకు భాగస్వామ్యం కల్పించనున్నారు. అంతేగాక ప్రభుత్వ శాఖలు, విద్యావ్యవస్థ, పథకాల్లో ప్రక్షాళన చేసేందుకు ప్రజల నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకోనున్నారు.