: 'సల్మాన్ ఖాన్' పేరిట చీప్ గా ప్రవర్తించాడు!


'బీయింగ్ సల్మాన్ ఖాన్' పేరిట ఉన్న ఓ ఫేస్ బుక్ పేజీని లైక్ చేసి ఓ డాక్యుమెంటరీ నటి ఇబ్బందులపాలైంది. వివరాల్లోకెళితే... సదరు నటి గత సెప్టెంబరులో సల్మాన్ ఖాన్ ఫేస్ బుక్ పేజీ అనుకుని ఓ పేజీని లైక్ చేసింది. అందులో సల్మాన్ వ్యక్తిగత ఫొటోలు అప్ లోడ్ చేసి ఉండడంతో అదే అఫిషియల్ పేజీ అని భావించింది. ఆ పేజీకి లక్షకు పైగా లైకులు ఉండడంతో ఆమె మరేమీ ఆలోచించలేదు. సల్మాన్ తో మాట్లాడాలని ఓ సందేశం కూడా పంపింది. దీంతో, ఆ పేజీ సృష్టించిన వ్యక్తి చాటింగ్ కు సిద్ధమని సంకేతాలిచ్చాడు. తన గత అనుభవాలు, ఎఫైర్లు, తదితరాలు ఆమెతో పంచుకున్నాడు. దీంతో, ఆమె తనతో చాటింగ్ చేస్తున్నది సల్మాన్ ఖానే అన్న భ్రమలో ఉండిపోయింది. పరిచయం బలపడిన తర్వాత ఆ నటి నగ్న ఫొటోలు కావాలని అతడు కోరడంతో ఆమె షాక్ తిన్నది. తనను కలవాలంటూ అసభ్యకరమైన భాష ఉపయోగించడంతో ఆ నటి చాటింగ్ కు స్వస్తి చెప్పింది. వెంటనే దీనిపై ముంబయిలోని వాన్రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు ఆ నకిలీ సల్మాన్ ఖాన్ వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు.

  • Loading...

More Telugu News