: ‘మాసాయిపేట’ చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంలో గాయపడి సికింద్రాబాదు యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై యశోదా ఆసుపత్రి హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. మరో నలుగురు చిన్నారుల పరిస్థితి అత్యంత విషమంగా ఉందని యశోదా వైద్యులు చెప్పారు. ఈ నలుగురిని అబ్జర్వేషన్ లో ఉంచినట్లు వారు తెలిపారు. 9 మందిని జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశామని డాక్టర్లు చెప్పారు.