: కేసీఆర్ వైఖరితో 30వ రాష్ట్రంగా దక్షిణ తెలంగాణ ఏర్పడొచ్చు: ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి


తెలంగాణ టీడీపీ నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కొత్త అంశాన్ని లేవనెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేబినెట్ లో ఉత్తర తెలంగాణ ప్రాంతానికే అధిక ప్రాధాన్యమిచ్చారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. దక్షిణ తెలంగాణ నేతలను కేబినెట్ లోకి తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ఈ మేరకు హైదరాబాదులో మీడియాతో ఆయన మాట్లాడారు. ఓ ప్రాంతానికి అధిక ప్రాముఖ్యత, మరో ప్రాంతంపై నిర్లక్ష్యం వహించడం సరైంది కాదని రేవంత్ హితవు పలికారు. కేసీఆర్ ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో 30వ రాష్ట్రంగా దక్షిణ తెలంగాణ ఏర్పడుతుందేమోనని సందేహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News