: క్రికెటర్ల మధ్య రగడ... భర్తను సపోర్ట్ చేసిన సానియా మీర్జా


వెస్టిండీస్ దీవుల్లో జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) సందర్భంగా విండీస్ బౌలర్ టినో బెస్ట్, పాకిస్థాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఓ దశలో ఇద్దరూ కలబడే పరిస్థితి తలెత్తింది. వెంటనే ఇతర ఆటగాళ్ళు, అంపైర్లు జోక్యం చేసుకుని వారిద్దరికీ సర్దిచెప్పారు. అటుపై హోటల్ వద్ద వీరిద్దరూ గొడవపడ్డారట. దీంతో, షోయబ్ మాలిక్ మ్యాచ్ ఫీజులో 60 శాతం కోతపెట్టారు. దీనిపై, షోయబ్ మాలిక్ అర్ధాంగి, భారత టెన్నిస్ తార సానియా మీర్జా ఘాటుగా స్పందించారు. టినోను ఓ మూర్ఖుడిగా అభివర్ణిస్తూ, అతడిని షోయబ్ తన్నాల్సిందని ట్వీట్ చేసింది. సానియా ట్వీట్ పై ప్రతికూల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆమె అలా ట్వీట్ చేయడం సరికాదని క్రీడా వర్గాలంటున్నాయి.

  • Loading...

More Telugu News