: సీబీఐ వలలో చెన్నై హ్యాకర్
సీబీఐ అధికారులు చెన్నైలో డి. ప్రభు అనే హ్యాకర్ ను అరెస్టు చేశారు. మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులకు సంబంధించిన పాస్ వర్డ్ లను తస్కరించడం, వాటిని పలువురికి విక్రయిస్తుండడం, కొన్ని ప్రభుత్వ వెబ్ సైట్లను హ్యాక్ చేయడం వంటి నేరాలకు పాల్పడినట్టు భావిస్తూ అతడిని అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా ఇతగాడి వ్యవహార శైలిపై కన్నేసిన సీబీఐ సైబర్ సెల్ వలపన్ని అరెస్టు చేసింది. అతడి ల్యాప్ టాప్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఇక, అతడి ఖాతాలో రూ.18 లక్షలుండగా, ఆ ఖాతాను స్థంభింపజేశారు. స్కూలు విద్యతోటే చదువుకు ఎగనామం పెట్టిన ప్రభు తానో మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్ నని చెప్పుకుతిరిగేవాడు.