: మోడీ ప్రభుత్వ తొలి బడ్జెట్ అద్భుతంగా ఉంది: భారతీయ సీఈవోలు
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలో ఏర్పాటైన తొలి ప్రభుత్వం పూర్తి స్వింగ్ లో దూసుకుపోతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, విధానాల పట్ల పలువురి నుంచి అనుకూలత వ్యక్తమవుతోంది. ఈ మేరకు అమెరికాలోని కార్నెగీ ఎండోమెంట్ లో నిర్వహించిన కార్యక్రమంలో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నుంచి వెళ్లిన పలువురు సీఈవోల ప్రతినిధివర్గం పాల్గొంది. అక్కడి వాషింగ్టన్ ఆడియెన్స్ తో సీఈవోలు పలు అంశాలపై మాట్లాడారు. ఇటీవల ఎన్నికల్లో భారీ స్థాయిలో మెజార్టీ సాధించి బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, ప్రభుత్వ, పరిశ్రమల రంగాల్లో అభివృద్ధిపై కొద్దిపాటి ఆశావాద భావం ఏర్పడిందన్నారు. ఈ క్రమంలో 2014-15కు గానూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ అద్భుతంగా ఉందని సీఐఐ అధ్యక్షుడు అజయ్ శ్రీరామ్ అభిప్రాయపడ్డారు.