: ఇండియాగేట్ వద్ద వీర జవాన్లకు నివాళి అర్పించిన రక్షణ మంత్రి
శత్రువుల బారి నుంచి మన దేశాన్ని రక్షించడానికి ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వీర జవాన్లకు కేంద్ర ఆర్థిక, రక్షణశాఖ మంత్రి అరుణ్ జైట్లీ నివాళి అర్పించారు. విజయ్ దివస్ సందర్భంగా ఢిల్లీలోని ఇండియాగేట్ వద్ద సైన్యాధ్యక్షుడు బిక్రమ్ సింగ్ తో కలసి నివాళులు అర్పించారు. అనంతరం జైట్లీ మాట్లాడుతూ, సైనికుల త్యాగాలు ఎంతో గొప్పవని కొనియాడారు. ఎలాంటి సవాళ్లనైనా దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా సైనిక బలగాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. అవసరాలకు అనుగుణంగా వివిధ రంగాలకు ప్రాధాన్యత ఇస్తామని... ఈ క్రమంలోనే ఖర్చులు చేస్తామని చెప్పారు. మిగిలిన చోట్ల వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకుని... వాటిని సైన్యానికి కేటాయిస్తామని తెలిపారు. బడ్జెట్లో రక్షణ రంగానికి నిధులను పెంచామని చెప్పారు.