: కృష్ణాజిల్లాలో 'బడి పిలుస్తోంది' కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి దేవినేని


కృష్ణాజిల్లాలో గొల్లపూడిలో 'బడి పిలుస్తోంది' కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలో అన్ని జిల్లాల్లోని పాఠశాలలకు పూర్తిస్థాయి భవనాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం గొల్లపూడిలో ఏర్పాటు చేసిన రుణ సంబరాల్లో మంత్రి, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి ఎక్కడున్నాడో జగన్ కు తెలుసునని ఉమా అన్నారు. ఎర్రచందనం వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News