: తిలక్ కు అంజలి ఘటించిన మోడీ
'స్వరాజ్యం నా జన్మ హక్కు' అంటూ బ్రిటీష్ వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన బాలగంగాధర్ తిలక్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా, పార్లమెంట్ సెంట్రల్ హాల్ లోని ఆయన చిత్రపటం వద్ద ప్రధాని మోడీ పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశానికి తిలక్ చేసిన సేవలను కొనియాడారు. తిలక్ 1856 జులై 23న జన్మించారు. 64 ఏళ్ల వయసులో 1920 ఆగస్టు 1న మరణించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో తిలక్ మొదటి తరానికి చెందిన నేత. తిలక్ కు పాకిస్థాన్ జాతిపిత జిన్నా అత్యంత సన్నిహితుడు.