: కామన్వెల్త్ గేమ్స్ లో సత్తా చాటిన తెలుగుతేజం
కామన్వెల్త్ గేమ్స్ లో తెలుగమ్మాయి మత్స సంతోషి సత్తా చాటింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ 53 కేజీల విభాగంలో కాంస్య పతకం కైవసం చేసుకుంది. 188 కేజీలు (స్నాచ్ 83 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ 105 కేజీలు) ఎత్తగలగడంతో తృతీయ స్థానంలో నిలిచింది. స్నాచ్ లో తొలి మూడు ప్రయత్నాలలో (78, 81, 83 కేజీలు) ఆమె సఫలమయింది. అయితే, క్లీన్ అండ్ జర్క్ లో తొలి రెండు ప్రయత్నాల్లో (102, 105 కేజీలు) సఫలమయినప్పటికీ... మూడో ప్రయత్నం (109 కేజీలు)లో విఫలమయింది. దీంతో ఆమె మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నైజీరియాకు చెందిన చికా అమలహ స్వర్ణ పతకాన్ని సాధించగా, పపువా న్యూగినియాకు చెందిన ఇద్దరు బిడ్డల తల్లి డికా తౌవా రజత పతకాన్ని సాధించింది. మత్స సంతోషి స్వగ్రామం విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామం.