: మారన్ లను విచారించేందుకు కావాల్సినంత సాక్ష్యం ఉంది: అటార్నీ జనరల్


ఎయిర్ సెల్-మాక్సిస్ ఒప్పందంలో మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్, అతని సోదరుడు కళానిధి మారన్ లను ప్రశ్నించేందుకు కావాల్సినంత సమాచారం ఉందని సీబీఐకు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ తెలిపారు. మలేసియాకు చెందిన వ్యాపారవేత్త టి.ఆనంద్ కృష్ణన్, మారన్ ల మధ్య క్విడ్ ప్రోకో ఒప్పందం జరిగిందని చెప్పినట్లు సమాచారం. దాంతో, త్వరలో మారన్ లను ప్రశ్నించి ఛార్జిషీటు దాఖలు చేయాలని సీబీఐ చూస్తోంది. ఈ క్రమంలో మారన్ కు చెందిన సన్ నెట్ వర్క్ షేర్లు బీఎస్ఈలో 12 శాతానికి పైగా పడిపోయాయి. అటు మారన్ లను సీబీఐ విచారిస్తే డీఎంకే, యూపీఏలు సమస్యల వలయంలో చిక్కుకోక తప్పదని సమాచారం.

  • Loading...

More Telugu News