: రైల్వే అధికారులతో జీఎం శ్రీవాత్సవ సమీక్షా సమావేశం
దక్షిణ మధ్య రైల్వే అధికారులతో జనరల్ మేనేజర్ శ్రీవాత్సవ సమీక్షా సమావేశం నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కాపలా లేని లెవెల్ క్రాసింగ్ లపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. రైల్వే గేట్ల పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులతో చెప్పారు. నిర్మాణంలో ఉన్న రైల్వే గేట్లను వారంలోగా పూర్తి చేయాలని జీఎం అధికారులను ఆదేశించారు.