: ఆ కుటుంబంలోని 13 మందికి జీవిత ఖైదు
భూవివాదం నేపథ్యంలో జరిగిన హత్య కేసులో ఒకే కుటుంబంలోని 13 మంది సభ్యులకు జీవితఖైదు విధించారు. ఆ 13 మందిలో నలుగురు మహిళలు కూడా ఉండడం విశేషం. ఒడిశాలోని రాయఘడ జిల్లాలో 2013 నవంబర్ 13న అశోక్ కిస్పోటా అనే రైతు కుటుంబసభ్యులపై అతడి పొలం పక్కనే ఉండే రౌత్ కుటుంబ సభ్యులు దాడి చేశారు. దీంతో అశోక్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో హతుడి భార్య సుష్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసు దర్యాప్తు, కోర్టు విచారణలో రౌత్ కుటుంబ సభ్యులు ఉద్దేశ్యపూర్వకంగానే అశోక్ ను హత్యచేసినట్టు రుజువైంది. దీంతో జాల్లా సెషన్స్ కోర్టు జడ్జి అనిల్ కుమార్ వారందిరికీ జీవిత ఖైదు శిక్షగా విధిస్తూ తీర్పు చెప్పారు.