: ఆ గజదొంగను పోలీసులే వదిలేశారు: చినరాజప్ప
ఆ గజదొంగను పోలీసులు వదిలివేసిన మాట వాస్తవమేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి చినరాజప్ప అన్నారు. దొంగను పట్టుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి పోలీస్ స్టేషన్ లో ఉన్న గజదొంగ పారిపోయాడని... కాదు కాదు పోలీసులే లంచం తీసుకుని వదిలేశారని మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై స్పందించిన చినరాజప్ప మాట్లాడుతూ... విచారణ అనంతరం సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.